ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) సెప్టెంబర్30: ఆర్మూర్ అలాగే ఆలూరు మండలానికి బదిలీల్లో భాగంగా విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు ఆర్మూర్ మండల విద్యాశాఖ తరఫున మండల శనివారం ఉదయం విద్యా వనరుల కేంద్రంలో ఆహ్వాన కార్యక్రమం ఎంఈఓ రాజగంగారం గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు.. వనజ రెడ్డి జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ ఆర్మూర్, ఎం.శ్రీనివాస్ జెడ్పిహెచ్ఎస్ పెర్కిట్, జి.నారాయణ జెడ్పిహెచ్ఎస్ సుర్బిరియాలు, చేతనకుమారి జడ్పిహెచ్ఎస్ చేపూర్,ఎం.నరేందర్ జెడ్పిహెచ్ఎస్ ఆలూరు, పండరి జడ్పిహెచ్ఎస్ మచ్చర్ల, ఇందిరా జెడ్పిహెచ్ఎస్ గోవింద్ పెట్,రమణారెడ్డి జడ్పిహెచ్ఎస్ రామచంద్ర పల్లి ,దృపద్ కుమార్ జడ్పిహెచ్ఎస్ గుత్ప, నాగరాజు జడ్.పి.హెచ్.ఎస్ కాల్లేద కళ్లెడ లకు రావడం జరిగింది. వీరికి మండల విద్యాశాఖ తరఫున ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంఈఓ రాజగంగారాం మాట్లాడుతూ.. విద్యాశాఖ లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘల బాధ్యులు, అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఆర్మూర్ లో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని పెంచి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారి వెంకట్ నర్సయ్య కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, జడ్పిహెచ్ఎస్ రామ్ మందిర్ చలం సార్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఆర్మూర్ డివిజన్ పిఆర్టియు అధ్యక్షులు లక్ష్మణ్ సార్, ఆలూరు మండల పిఆర్టియు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అశ్వక్ హైమద్, పిఆర్టియు సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నట్లు ఎంఇఓ రాజ గంగారాం తెలిపారు.