Telugu Updates

మామిడిపల్లిలో స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం. -అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు పోలీసు అధికారులు.

Post top

మామిడిపల్లిలో స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం.

–అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు పోలీసు అధికారులు.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) సెప్టెంబర్ 25: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్టూడెంట్స్ యూత్ సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లను, ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన దాతలతో పాటు విగ్రహ దాత మెట్పల్లి తిరుమల చారి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీత రవిగౌడ్, కవిత కాశీరాం, ఆకుల రాము, సుజాత రమేష్, భారతి భూషణ్, రేవతి గంగా మోహన్, భాగ్య శివకృష్ణ, వర్ష నర్సారెడ్డి, డాక్టర్ రామగిరి భాను, డాక్టర్ స్రవంతి రెడ్డి, ఎస్సై లు అశోక్,అంజమ్మ,ఏఎస్ఐ చిన్నయ్య, జిల్లా బిఆర్ఎస్ యువజన నాయకులు మల్యాల నర్సారెడ్డి,స్టూడెంట్స్ యూత్ సభ్యులు,తదితరులు ఉన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.