Telugu Updates

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్న స్నేహితులు. -చిన్నారిపై 50 వెయ్యిలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసిన స్నేహితుడు మాజీ కౌన్సిలర్ సడాక్ వినోద్, జన్నపల్లి రంజిత్ (BRS ఎస్పీ సెల్ పట్టణ అధ్యక్షుడు).

Post top


స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్న స్నేహితులు..                                                — చిన్నారిపై 50 వెయ్యిలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ చేసిన స్నేహితుడు మాజీ కౌన్సిలర్ సడాక్ వినోద్, జన్నపల్లి రంజిత్ (BRS ఎస్పీ సెల్ పట్టణ అధ్యక్షుడు)

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) సెప్టెంబర్25: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి నరేందర్ గత 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గత ఆరు నెలల నుండి ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 11వ తేదీన ఉదయం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న స్నేహితుడు మాజీ కౌన్సిలర్ యూత్ ఐకాన్ సడాక్ వినోద్ ఆధ్వర్యంలో కుల సంఘ పెద్దల సమక్షంలో ఆయన అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా మృతిని కుటుంబానికి భార్య, చిన్నారి కలదు. మానవత్వానికి ప్రతిక గా నిలిచి స్నేహితుని కుటుంబానికి పలువురు స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ.. ఆ కుటుంబీకులో ఒకరైన చిన్నారి పై స్థానిక పోస్ట్ ఆఫీస్ లో 50 వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహితుడు మృతి చెందాడన్న విషయం తెలిసిన పలువురు స్నేహితులు ఉదారసబ చాటుకుని మానవత్వ రూపంలో క్లాస్ మెంట్ మిత్రులు, పలువురు స్నేహితులు కలిసి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు మాజీ కౌన్సిలర్ యూత్ ఐకాన్ సడాక్ వినోద్ తెలిపారు. ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో పాలుపంచుకున్న మిత్రులు బిఆర్ఎస్ పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు జన్నపల్లి రంజిత్, నాయినిబ్రహ్మ కుల సంఘ పెద్ద మనుషులు ఇతర మిత్రులు ఉన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.