Telugu Updates

ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీస్ లు. -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Post top

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సీఎం కేసిఆర్ మదిలోంచి పుట్టిన వినూత్న ఆలోచన.

– దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు ఇట్లాంటి క్యాంపు కార్యాలయాలు లేవు.

– ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకు ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీస్ లు.

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ(తెలంగాణ ఫోకస్)సెప్టెంబర్24: బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రెసిడెన్షియల్,ఆఫీస్ లను ప్రారంభించి మంత్రి దంపతులు సతీసమేతంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం బయట చేపట్టవలసిన పనులపై ఆర్ అండ్ బి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్బంగా మీడియాతో మంత్రివర్యులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సీఎం కేసిఆర్ మదిలోంచి పుట్టిన వినూత్న ఆలోచన అని అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు ఇట్లాంటి క్యాంపు కార్యాలయాలు లేవని ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసిఆర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేశారన్నారు. ఓ కార్యాలయం అనేది లేక ప్రజల సమస్యలపై గెస్ట్ హౌస్ లల్లో మీటింగ్ పెట్టుకునే దుస్థితి ఉండేదని,అట్లాంటి సమస్యలు అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలతో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్,మీద ఫస్ట్ ఫ్లోర్ రెసిడెన్స్,సెక్యూరిటీ స్టాఫ్ రూమ్స్ కూడిన అధునాతన భవనాన్ని నిర్మించామన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ స్థల ఫైనలైజ్ విషయంలో కాస్త ఆలస్యమైందని కానీ చక్కని వాస్తుతో,తూర్పు ముఖంగా బిల్డింగ్ నిర్మించామని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు ఈ క్యాంపు కార్యాలయం నుండి పరిపాలన మరింత చేరువయ్యి, మంచి సేవలు అందాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, కోటపాటి నర్సింహ నాయుడు,ఆర్డీవో వినోద్ కుమార్, నిజామాబాద్ ఆర్ అండ్ బి ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.