ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)సెప్టెంబర్17: ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ప్రతి ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం కాలనీ వాసుల సమైక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. గత 16 వారాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాలనిలోని రోడ్లను, సామాజిక ప్రదేశాలను, తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. 16 వ ఆదివారం కాలనీ లోని భక్త హనుమాన్ మందిరం, సామాజిక హాలు పరిసరాల్లో శ్రమదానం నిర్వహించారు. ఆలయంలో జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అభివృద్ది కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు కలిసి మందిరం పరిసరాలను శుభ్రం చేశారు. సామాజిక భవనం ముందు పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తుా అందరికీ స్పూర్తిగా నిలిచామని తెలిపారు. స్వచ్ఛత, సమైక్యత లోనే కాకుండా అభివృద్ది లోనూ ఆదర్శంగా ఉంటామని పేర్కొన్నారు. కాలనీలో కోతులు, కుక్కల బెడదను నివారించడానికి మున్సిపల్ వారు చర్యలు తీసుకోవాలని ఉపాద్యక్షుడు సుంకే శ్రీనివాస్ కోరారు. ఆలయ కమిటీ అద్యక్షుడు శివరాజ్ కుమార్, అభివృద్ది కమిటీ ప్రధాన కార్యదర్శి కమలాకర్, ఉపాద్యక్షుడు కొక్కర భూమన్న, గడ్డం శంకర్, ఎల్టీ కుమార్, రాపెల్లి సతీష్, ఎర్ర భూమయ్య, మురళి, మహేశ్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.
Related Posts