Telugu Updates

రక్తదానం చేయడం సామాజిక బాధ్యత.. ప్రముఖ జర్నలిస్ట్ వి6 ప్రసాద్. -ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలి -యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.

Post top

రక్తదానం చేయడం సామాజిక బాధ్యత. ప్రముఖ జర్నలిస్ట్ వి6 ప్రసాద్.

-ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలి
-యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలి.

ఆర్మూర్(TELANGANA FOCUS) సెప్టెంబర్16: రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అని ప్రముఖ జర్నలిస్ట్ వి6 ప్రసాద్ అన్నారు. రక్త దానం చేయడంలో రాష్ట్రంలో మన జిల్లా మొదటి స్థానంలో నిలవాలని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితిలో నిజామాబాద్ హోప్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నిజామాబాద్ కు చెందిన పండరి గారికి A+ బ్లడ్ అవసరమైనందున ఆర్మూర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వి6 టి ప్రసాద్ “స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ చేయడం శనివారం జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ వి6 ప్రసాద్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో మనం రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. యువత రక్తదానం చేసే విధంగా స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. మనం ఆరోగ్యంగా ఉండాలని, ఇతరులకు రక్తదానం చేస్తామనే ధైర్యం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా రక్త దానం గొప్పదని చెప్పారు.

స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ అధినేత మాదరి స్వామి ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న అనేక మందికి ఇప్పటివరకు రక్తదానం అందించడం జరిగిందని ఇప్పటికీ ఆపదలో ఉన్న వ్యక్తులకు మన వంతు బాధ్యతగా ప్రతినిధులు, ప్రజలు, యువత, స్నేహితులు, రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని అందుకు మన వంతు బాధ్యతగా రక్తదానం చేయాలని నిండు ప్రాణాన్ని కాపాడడానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు ప్రజల్లో రక్తదానం ఎంతో గొప్పది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే విధంగా ముందు కొనసాగాలని ప్రముఖ జర్నలిస్ట్ వి6 ప్రసాద్ అన్నారు. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం చేస్తే నీరసంగా ఉంటారనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. రక్తం పెరగాలంటే ఆకుకూరలు, బెల్లం, మొలకెత్తిన విత్తనాలు, క్యారెట్,బీట్రూట్, వేరుశెనగ తినాలని చెప్పారు. రక్త దానం ప్రాముఖ్యత పై స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా వివరించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలి పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి అండగా నిలవాలన్నారు.

ఈ కార్యక్రమంలో రక్తదానం చేసే క్రమంలో ఆయన వెంట సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ పేట్ నరేష్, స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ అధినేత మాధరి స్వామి తదితరులు ఉన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.