టి.వి.యు.యు.వి.బి ఆధ్వర్యంలో అస్వస్థతకు గురై చికిత్సపొందుతున్న బాలికలను పరామర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు..

భీంగల్(తెలంగాణ ఫోకస్)సెప్టెంబర్12: టివియువి,ఏఐయస్.బి ఆధ్వర్యంలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాలికలను విద్యార్థి సంఘాల నాయకులు టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, ఏ.ఐ.యస్.బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి లు పరామర్శించారు. ఈ సందర్భంగా టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, ఏ.ఐ.యస్.బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ వసతి విద్యార్థులు కలుషిత ఆహారం తిని వందమంది అనారోగ్యానికి గురి కావడం జరిగిందని, గతంలో ఈ హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు పడి విద్యార్థులు ఇబ్బందిపడ్డప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీ పై చర్యలు తీసుకోలేదు. అర్ధరాత్రి విద్యార్థినిలు హాస్టల్లో వండిన ఆహారం తిని సుమారు 100మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడం విడ్డూరంగా ఉంది. విద్యాలయాలు చెత్తకుప్పలా తయారు చేసారని అన్నారు.మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలా ఉంటే జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి వేముల స్పందించాలని, అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను కలిసి వారి యోగక్షేమాలను చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న బాధ్యులపై చర్య తీసుకోకపోవడం అన్యాయమని వెంటనే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి హాస్టల్ నిర్వాకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేసారు