Telugu Updates

విద్య హైస్కూల్లో “రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్” అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.

Post top

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) సెప్టెంబర్08: రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆర్మూర్ పట్టణంలోని స్థానిక విద్య హైస్కూల్లో నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 20, ప్రైవేటు ఉపాధ్యాయులు 10 మందిని గౌరవప్రదంగా పూలమాల శాలువా సర్టిఫికెట్ జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా కీలకమని విద్యార్థి యొక్క నైపుణ్యాలను విలువలను, వెలికి తీసే పాత్ర దేశంలో ఉపాధ్యాయులే అని, విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ మరియు స్పాన్సర్ విద్యా ప్రవీణ్ పవార్, కార్యదర్శి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ పి.డి.జి హనుమంత్ రెడ్డి, ఏ.జి.శ్రీనివాస్ పద్మ మురళి,కాంతి గంగారెడ్డి పుష్పకర్ రావ్,సురేష్, గోనె దామోదర్,ఆనంద్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.