ఆర్మూర్(TELANGANA FOCUS) సెప్టెంబర్06: ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డు రంగాచారి నగర్ లో గల అంగన్వాడి కేంద్రంలో మంగళవారం అంగన్వాడి బోధకురాలు అరుంధతి, ఆయమ్మల ఆధ్వర్యంలో సూపర్వైజర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోషక వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పోషక వారోత్సవాలపై ముఖ్య అతిథి మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు పుట్టబోయే బిడ్డ కోసం పౌష్టికాహార లోపం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గుడ్డు,పాలతో పాటు బాలామృతాన్ని,సమీకృత భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మహిళలు,తల్లిదండ్రులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

