Telugu Updates

విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి -నరేంద్ర కళాశాల చైర్మన్ శంకర్, ప్రిన్సిపల్ రాజేంద్రకుమార్.

Post top

విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి
-నరేంద్ర కళాశాల చైర్మన్ శంకర్, ప్రిన్సిపల్ రాజేంద్రకుమార్.

ఆర్మూర్(TELANGANA FOCUS) సెప్టెంబర్ 05: ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని ఉపాధ్యాయులకు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ రాజేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేయాలని కళాశాల కరస్పాండెంట్ నరేంద్ర కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర కుమార్ హితవు పలికారు.

నరేంద్ర డిగ్రీ & పీజీ కాలేజ్ ఆర్మూర్ లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా నరేంద్ర కళాశాల చైర్మన్ శంకర్, ప్రిన్సిపాల్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్యార్థుల ఆశయానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం విద్యార్థులలో మెరుగైన విద్య, విజ్ఞానాన్ని పెంపొందిస్తూ సమసమాజ స్థాపనకు మూల కారకులుగా నిలువాలని కోరారు. గురువుల ఔన్నత్యం గురించి ఎంత పొగిడినా తక్కువేనని, సమాజ నడవడిక ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉంటుందని గుర్తు చేశారు. దీనిని గుర్తెరిగి తమ గురుతర బాధ్యతలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. విద్యా బోధనతో పాటు విద్యార్థులలో నైతిక విలువలు, సద్గుణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు.

సమాజంలో ఎవరు ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నా, అందుకు గురువు అందించిన తోడ్పాటు, కృషియే కారణమని అన్నారు.అంకితభావం, నిబద్దతతో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుందని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించిన వారవుతారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, విద్యాబుద్ధులు, వినయ విధేయతలు నేర్పించి జీవితంలో నిలదొక్కుకునేలా చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. అందుకే గురువులను దైవంతో సమానంగా భావిస్తారని అన్నారు. మా కళాశాల లో చదువుకునే విద్యార్థుల వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసి ఆదర్శప్రాయులుగా నిలువాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. అదే సమయంలో సామాజిక బాధ్యతలను సైతం గుర్తెరిగి తమవంతు పాత్ర పోషించాలని, చక్కటి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు దిక్సూచిగా నిలువాలని నరేంద్ర కళాశాల చైర్మన్ శంకర్, ప్రిన్సిపల్ రాజేంద్రకుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ జిన్నా గంగాధర్ కళాశాల అధ్యాపకులు నరేష్ మహేష్ ధనుంజయ్ సుబ్రహ్మణ్యం సాయన్న రవి రామరాజు రాము లక్ష్మణ్ సుధీర్ కిరణ్ గంగాధర్ లు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు కళాశాల అధ్యాపకులకు జ్ఞాపికలను అందజేశారు. ఇట్టి కార్యక్రమాన్ని ఎన్ఎస్ ఆధ్వర్యంలో విజయవంతం చేశారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.