ఆర్మూర్(TELANGANA FOCUS)ఆగస్టు22: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామ శివారులో గల ఎం జె ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధు శేఖర్ ను మంగళవారం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గుమ్మడి శంకర్, దూద్వాడ్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య శాఖ రాష్ట్ర చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి పలు విషయాలపై చర్చించారు. దీంతో డాక్టర్ మధు శేఖర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలం పాటు కొనసాగే పదవికి తగిన న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రస్థాయి పదవి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆర్మూర్ ఉపాధ్యక్షుడు చిరంజీవి, కనికరం నవీన్, జనార్ధన్, పట్టెం సతీష్, జోయల్ చంద్ర, రాంపూర్ శ్రవణ్, భోగ రమణ తదితరులు పాల్గొన్నారు.