Telugu Updates

మాక్లూర్ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ పాపన్న 373వ జయంతి

Post top

మాక్లూర్(TELANGANA FOCUS)ఆగస్టు18: సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 373వ జయంతిని మాక్లూర్ మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజన వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న అనేక పోరాటాల స్ఫూర్తితో రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర సర్దార్ పాపన్నకు ఉందని మాక్లూర్ గౌడ సంఘం అధ్యక్షులు పుంజు దిలీప్ గౌడ్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ పాపన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం చాలా గర్వకారణమైన తెలిపారు. రాబోయే రోజుల్లో సర్దార్ పాపన్న విశిష్ట గురించి విద్యార్థుల పార్టీ పుస్తకాల్లో సర్దార్ పాపన్న చరిత్ర తెలియజేయాలని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదన కింద గల్లి నుండి ఢిల్లీ వరకు గౌడ కులానికి సీట్లు ఇవ్వాలని కోరారు.పాపన్న జయంతి కార్యక్రమంలో భాగంగా స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎస్సై సుదీర్ రావు, మాక్లూర్ గ్రామ గౌడ నాయకులు, మండల గౌడ సంగం ప్రహ్లాద గౌడ్, విజయ్ గౌడ్, సత్య నారాయణ గౌడ్, చిన్న గౌడ్,నవీన్ గౌడ్,పండు గౌడ్,విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.