Telugu Updates

కోమన్ పల్లి “ప్రభుత్వ పాఠశాల” స్థలాన్ని కాపాడుకుందాం. -కోమన్ పల్లి గ్రామ ప్రజలు

Post top

 

కోమన్ పల్లి “ప్రభుత్వ పాఠశాల” స్థలాన్ని కాపాడుకుందాం.
– అన్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి
– ఆనాడు సాంఘిక కుల బహిష్కరణ చేయలేదు.. గ్రామ ప్రజలు
– అసత్య ప్రచారాలు నమ్మకండి.. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం.
– కోమన్ పల్లి  గ్రామ ప్రజలు..
ఆర్మూర్(TELANGANA FOCUS TV) ఆగస్టు10: ఆర్మూర్ మండల కోమన్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠషాల భూమి సర్వే నం. 301 (ఆబాది) కలదు. పిల్లల ఆటల కొరకు సర్వే నంబర్ 407గల భూమి యజమాని అయిన నల్లా శ్యాం సుందర్రెడ్డి అనే వ్యక్తి 1982 లో పాఠశాల కొరకు విరాళంగా అందించారు. పాఠశాల ముందు ఉన్న మాటు కాలువ వరకు పాఠశాల హద్దుగా తెలిపాడు. పైన ఉన్న భూమిని కొన్ని సం| క్రితం. మచ్చెర్ల గంగారెడ్డి గ్రా॥ సుర్బిర్నాల్ అనే వ్యక్తికి అమ్మినారు. అయితే అయ్మిన శ్యాంసుందర్ రెడ్డి చనిపోయిన తర్వా త ఈ వ్యక్తి పాఠశాల ఆనుకొని ఉన్న మాట కాలు వ హద్దును దాటి పాఠశాల ఆనుకొని ఉన్న భూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు. కావున దయచేసి ప్రభుత్వ పాఠశాల భూమిని కాపాడాలని మీడియా ద్వారా ప్రభుత్వం కోరారు
– సాంఘిక కుల బహిష్కరణ చేయలేదు.
– విడిసి సభ్యులు.
ఆర్మూర్‌ మండలం కోమన్‌ పల్లి గ్రామానికి చెందిన గొల్ల కురుమ, నాయక పోడు కుటుంబాలను గ్రామ విడిసి సాంఘిక కుల బహిష్కరణ చేయలేదని ఆర్మూర్ లో గురువారం ఉదయం వీడియోతో మాట్లాడారు. బాధిత కులసంఘాల కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. కోమన్‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన సుబ్బిర్యాల్‌ గ్రామానికి చెందిన ఎమ్ఎన్‌ గంగారెడ్డికి సుమారు 8 ఎకరాల 23 గుంటల స్థలం ఉంది, కాగా కెనాల్‌ పక్కనుండి మరో 30 గుంటల స్థలం కూడా అతనికి సంబంధించినదే.
20 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసిన భూమిని సదురు వ్యక్తి ఇటీవల 30 గుంటల స్థలానికి రెవెన్యూ సర్వే చేపట్టి పంచనామా చేస్తే సంబంధిత భూమికి పంచులుగా కోమన్‌పల్లి గ్రామానికి చెందిన గుజ్జ అశోక్‌ యాదవ్‌, నిమ్మ పోషెట్టీ (నాయక పొడు) సంతకాలను పెట్టారు. కోమన్‌పల్లి గ్రామస్తులు ఇద్దరు సంతకాలు పెట్టడం వల్లే 30 గుంటల స్థలం గంగారెడ్డికి దక్కిందని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఇరువురిపై ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నెల 7వ తేదీన సంబంధిత విషయమై ఆర్మూర్‌ సీఐ సురేష్‌ బాబుకు ఫిర్యాదు చేయగా 8వ తేదీన సీఐ వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపించి ఇరు వర్గాల వారిని సముదాయం చేసి వెళ్లారు. అదే రోజు నుండి గొల్ల కురుమ 28 కుటుంబాలు, నాయకపోడు 22 కుటుంబాలను సాంఘిక కుల బహిష్కరణ చేశారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎవరు కూడా ఆరోజు బహిష్కరణ చేయలేదని మీడియా ముఖంగా గురువారం తెలియజేశారు. గురువారం వీడియో తో మాట్లాడిన గ్రామ ప్రజలు సభ్యులు అందులో ముఖ్యంగా మరోపంతకు చెందిన నాయకుడు సంఘ సభ్యులు ఉన్నారు.
అసత్య ప్రచారాలు నమ్మకండి గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉన్నామని గ్రామ ప్రజలు మీడియాతో తెలిపారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.