Telugu Updates

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.

Post top
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
ఆర్మూర్ (TELANGANA FOCUS)ఆగస్టు04: ఆర్మూర్ పట్టణంతోపాటు డివిజన్ లోని గ్రామాలలో ఇండ్లు అద్దెకిచ్చే యజమానులు కిరాయి దారుల వద్ద నుంచి ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత అద్దెకు ఇవ్వాలని ఏసీపీ జగదీష్ చందర్ అన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ లోని కొటార్మూర్లోని 5వ వార్డు శ్రీనివాస కాలనీలో శుక్రవారం ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఏసీపీ మాట్లాడుతూ.. పట్టణంలోని వీధులలో, గ్రామాలలో కొత్తగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటి యజమానులు ఇతర గ్రామాలకు వెళ్లడానికి ముందు పోలీసులకు సమాచారం ఇస్తే గస్తీ బృందాలు తిరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లు, దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. నేరాలు అరికట్టడంలో భాగంగానే కార్డెన్ సెర్చ్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని వివరించారు. ఈమధ్య ఆర్మూర్ లో జరిగిన రెండు హత్యల ఆనవాళ్లు సీసీ కెమెరాలతో గుర్తించినట్లు తెలిపారు. సీ.ఐ సురేష్ బాబు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలలో మృతిచెందితే కుటుంబం అనాథగా మారుతుందన్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో భీంగల్, ఆర్మూర్ రూరల్ సీఐలు వెంకటేశ్వర్లు, గోవర్ధన్ రెడ్డి, ఎస్సెలు పాల్గొన్నారు.
– కార్డెన్ సెర్చ్ లో 66 వాహనాలు స్వాధీనం.
ఆర్మూర్ మున్సిపల్ లోని కోటార్మూర్లో ఏసీపీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.
ఈ తనిఖీలో 58 ద్విచక్ర వాహనాలు,5ఆటోలు, మూడు కార్ ల పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించారు. కాలనీలో ఒక రౌడీషీటర్, ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించారు. ఈ తనిఖీలో ఆర్మూర్ డివిజన్ కు చెందిన ముగ్గురు సీఐలు, 9మంది ఎస్ఐలు, 25 మంది ఏఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీ.ఐ లు సురేష్ బాబు, గోవర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్సెలు గంగాధర్,అశోక్, అంజమ్మ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.