Telugu Updates

కీటక జనిత వ్యాధుల అవగాహన కార్యక్రమం. -ముఖ్య అతిథిలుగా డిఎంహెచ్ఓ డాక్టర్.సుదర్శనం, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్.

Post top

ఆర్మూర్(TELANGANA FOCUS)ఆగస్టు2: ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ఆర్మూర్ డివిజన్ స్థాయి వైద్యాధికారులు, సూపర్వైజర్ స్థాయి అధికారుల సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రస్తుతం వర్షాకాలంలో సంభవించే కీటక జనిత వ్యాధుల నివారణ చర్యలు మరియు అవగాహన కార్యక్రమంపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ.. నీటి నిల్వల వల్ల దోమలు వృద్ధి చెంది డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా బోధకాలు మెదడువాపు వంటి వ్యాధులు సంభవిస్తాయి కాబట్టి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలను అవగాహన కల్పించాలని తెలియజేశారు. అలాగే ప్రతి శుక్రవారం “డ్రై డే ఫ్రై డే” అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు అలాగే రేపు NDD కార్యక్రమం కలదు కావున ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ సూచించారు. ఇందులో భాగంగా ఆగస్టు మొదటివారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవగాహన కల్పించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్,ఆర్మూర్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ రమేష్, ఆర్మూర్ డివిజన్ వైద్యాధికారులు,సూపర్వైజర్ స్థాయి అధికారులు,ఏఎన్ఎం లు వైద్య సిబ్బంది, ఏసీడీపీఓ జ్యోతి, సీడీపీఓ భార్గవి, అంగన్వాడి డివిజన్ స్థాయి అధికారులతోపాటు ఆ ప్రాంత అంగన్వాడి టీచర్స్, సూపర్వైజర్స్ పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.