తెలంగాణ రాష్ట్ర మార్క్ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి సమక్షంలో రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.







ఆర్మూర్(TELANGANA FOCUS)జూలై30: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఎం.ఆర్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఫార్ములా 36వ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్మూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం 2023-24 గాను నూతన అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ, కార్యదర్శి పట్వారి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ గార్లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మార్క్ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి హాజరై రోటరీ క్లబ్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వారు చేసే సేవలను ఆయన కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ క్లబ్ ను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని రోటరీ క్లబ్ తోనే సేవా కార్యక్రమాలు సాధ్యమవుతాయని రాష్ట్ర మార్క్ఫైడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. గౌరవ అతిథులుగా నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ వి.శ్రీనివాస్ రావు పి.డి జి హనుమంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.