Telugu Updates

ఆర్డీవో ను ఘనంగా సన్మానించిన ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

Post top
ఆర్మూర్(TELANGANA FOCUS) జూలై15: ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున ఆర్మూర్ ఆర్డీవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టి.వినోద్ కుమార్ గారిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజ సేవకులు అని ఆర్డీవోకు మరోసారి గుర్తు చేశారు. గతంలో ఆర్మూర్ తాసిల్దారుగా విధులు నిర్వహించిన వినోద్ కుమార్ సీనియర్ జర్నలిస్టులను గుర్తించి కాసేపు పాత విషయాలను గుర్తు చేసుకోవడం జరిగింది. అనంతరం జర్నలిస్టులు చేసే సేవలను గుర్తించాలని ప్రభుత్వం నుంచి వచ్చే రాష్ట్ర ఫలాలను నేరుగా జర్నలిస్టులకు అందే విధంగా చూడాలని కోరారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు,డబల్ బెడ్ రూమ్ లు అర్హులైన జర్నలిస్టులను గుర్తించి అందించాలని ఆర్డీవో వినోద్ కుమార్ గారిని కోరారు. ఆర్టీవో సానుకూలంగా స్పందించి జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, చట్టప్రకారంగా ప్రభుత్వం విడుతలవారీగా ఫలాలను అందజేస్తుందని తెలిపారు. అటు ప్రభుత్వానికి ప్రజలు సమన్వయంతో కూడుకొని ఉండాలని, ప్రజల సహకారం, జర్నలిస్టుల సహకారం ప్రభుత్వానికి తప్పనిసరి అని ఆర్డీవో అన్నారు. అలాగే అందులో భాగంగా రెవిన్యూ భూస్థలాల సమస్యలను రెవెన్యూ చట్ట ప్రకారంగా పనులు కొనసాగుతాయని ఆర్డీవో అన్నారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలు సహకరించాలని, తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకునే దిశలో ఇరువర్గాలవారు ముందుకు కొనసాగాలని తెలిపారు. ఘనంగా సన్మానించిన ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక థాంక్స్ ఆర్డీవో వినోద్ కుమార్ చెప్పారు
ఘన సన్మాన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి, ఉపాధ్యక్షులు గుండు నాగరాజు, గౌరవ అధ్యక్షులు మోహన్ దోండి, సంయుక్త కార్యదర్శి కనుగుట్ట మోహన్ బాబు, కోశాధికారి దోండి సంతోష్, ఏ.రాజేష్, కార్యనిర్వాహక కార్యదర్శి గట్టడి అశోక్ కుమార్, రాజేష్, ఎస్.సంతోష్ తదితర వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.