ఆర్మూర్(TELANGANA FOCUS) జూన్ 29: బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని ఆర్మూర్ ఎమ్మెల్యే,పియుసి ఛైర్మన్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి జిల్లాప్రజలకు, ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు, జిల్లా మైనారిటీలకు అలాగే ముఖ్యంగా జీవనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డైనమిక్ ఎమ్మెల్యే,పియుసి ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి కులాలకు మతాలకు అతీతంగా ఉండి, సంపండ వర్గాలను సమానంగా చూసి అన్ని మతాలను గౌరవించేవారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిరంతరం జిల్లా ప్రజల యోగక్షేమాలు గురించి ఆలోచిస్తూ వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి నేరుగా వచ్చే రాష్ట్ర ఫలాలను ప్రతి లబ్ధిదారుడికి వారి ఖాతాలో అందించే విధంగా, ఆర్మూర్ కు ఆదర్శంగా నిలిచి రాష్ట్రంలోనే ఎక్కడలేని నియోజకవర్గాల్లో అభివృద్ధిని ఆర్మూర్ నియోజకవర్గంలో చేసిన వ్యక్తి కేవలం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు.
బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని పలు ఈద్ గాహ్ లు, మసీదులు సందర్శించారు ఎంతో భక్తిశ్రద్ధలతో త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ జరుపుకుంటున్న మైనారిటీ సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే
ప్రజలందరికీ ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతాలకు అతీతంగా బక్రీద్ పండుగను జరుపుకోన్న మైనార్టీ సోదరులకు ఆనందం వ్యక్తం చేశారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ప్రజలు నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోన్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ పట్టణంలో గల మామిడిపల్లి పెర్కిట్ నిజామాబాద్ ఎక్స్ రోడ్ వద్ద గల ఈద్ గాహ్ లో ప్రత్యేక ప్రార్థనలు, ముస్లిం మత పెద్దలతో కలిసి నిర్వహించారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుల ఇంటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ చెప్పి వారి అతిథిని స్వీకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట ఆర్మూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, ప్రముఖ సీనియర్ నాయకులు పండిత్ పవన్, మాజీ సర్వసరం అధ్యక్షులు సుంకరి రవి,ఖాందేష్ శ్రీనివాస్, మైనారిటీ పెద్దలు, పట్టణ కౌన్సిలర్లు, మైనారిటీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారు