పార్వతీపురం:నోట్ల మార్పిడి చేస్తామని జిల్లా కేంద్రంలో 90 లక్షల నగదుతో పరారైన ఘనులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కాకినాడ, భీమవరం చెందిన చక్రపాణి, నజిమ్ మరో
ఇద్దరు తొంభై లక్షలకు ఐదు వందల నోట్లు ఇస్తే కోటి రూపాయల రెండు వేల రూపాయల నోట్లు ఇస్తామని ఎర వేసారు. ఆఫర్ కు ఆశపడ్డ రేగిడి ఆమదాలవలస చెందిన బాధితులు ఎ.
అనిల్, వి.అనిల్ లు తొంభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. కోటి రూపాయలు రెండు వేల నోట్లు వేరే చోట ఉన్నాయని నమ్మించి తొంభై లక్షలతో నిందితులు పరార్ అయ్యారు. బాధితులు ఆశ పడి తమ స్నేహితుల వద్ద అప్పులు తెచ్చి తొంభై లక్షలకు ఐదు వందల నోట్లు ఏర్పాటు చేసారు. మోసపోయామని తెలిసి బాధితులు పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు.నలుగురిలో ఇద్దరు దొరికారు. మరో ఇద్దరు పరారీలో వున్నారు.