విశాఖపట్నం:విశాఖలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి.సాగరతీరా నికి మణిహారంగా నిలుస్తున్న రాజీవ్ స్మృతి భవన్ పేరు మార్పును తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేపట్టారు.రాజీవ్ స్మృతి భవన్ ను ఆర్కేబీచ్ సమీపంలో 2008లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి రాజీవ్ గాందీ జీవిత చరిత్రను ప్రజలకు తెలిసేలా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.అయితే ఏపీ ప్రభుత్వం ఈ రాజీవ్ గాంధీ స్మృ తి భవన్ పేరు మార్చాలనే ప్రతిపాద నలు సిద్దం చేస్తున్న తరుణంలో కాం గ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగి తమ ఆందో ళన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యల్లో బాగంగానే పేరు మార్చాలని ప్రయత్నిస్తోందని నగర అధ్య క్షులు గొంపా గోవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా దీన్ని ప్రారం భించారనే అంశాన్ని గుర్తు చేసిన ఆయన తన తండ్రి వైఎస్సార్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రాజీవ్ స్మృతి భవన్ పేరు మార్చడం సరికాద ని అన్నారు.తక్షణమే ప్రభుత్వ ప్రతిపా దనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.