ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఏమిగోస్ 21st సెంచరీ ఐ ఏ ఎస్ అకడామి లో మొక్కలు పంపిణి చేసిన ఆకెళ్ళ రాఘవేంద్ర, డైరక్టర్ రమణ రెడ్డి ప్రకృతి ని కాపాడుకోకుంటే సమాజం మనుగడ కష్టతరం అవుతుంది అని ప్రముఖ రచయిత, మోటివేషన్ స్పీకర్ అకేళ్ళ రాఘవేంద్ర అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిందే అని అయన తెలిపారు. మన నివసించే ప్రాంతాలను మొక్కలు నాటి పర్యావరాణాన్ని కాపాడాలి అని అన్నారు.
ప్రభుత్వాలు, ప్రపంచం ఆరోగ్య సంస్థ తో సహా తెలంగాణ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి అనేక స్వచ్చంద సంస్థలు వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం చూస్తే దీని అవసరం ఎంత ఉందొ తెలిసి పోతుందన్నారు. ఏమిగోస్ డైరక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తు లు సంబవించినపుడు ఆక్సీజన్ కొరత తో అనేక మంది చనిపోయారు అని.. కాబట్టి పర్యావరనం కాపడ్డం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా అకేళ్ళ రాఘవేంద్ర తో కలసి రమణ రెడ్డి ఇన్స్టిట్యూట్ లోని విద్యార్థుల కి మొక్కలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో మస్కు రమేష్, కలుకూరి రాజు, ఫ్యాకాల్టీ సురేష్, అద్ నాన్, సానా రాజేంద్ర ప్రసాద్,ఇతర సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.