Telugu Updates

విద్యార్దులకు సమాజ పరిజ్ఞానం కూడా ఉండాలి

Post top

హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్  డా.బండా ప్రకాష్ ముదిరాజ్  పాల్గొన్నారు.అయన మాట్లాడుతూ లంగాణ సమాజాన్ని తీసుకుంటే  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి,  అదే విధంగా దొడ్డి కొమురయ్య  జయంతి.

జాం జాగిర్డార్ జమిందార్ల ఆగడాలను దొడ్డి కొమురయ్య   ఎదుర్కొన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం ఈ నెలలో వారిని కూడా గౌరవించుకునే అవకాశం దక్కింది. సంస్కరణలకు తొలి గురువుగా ఉన్న వ్యక్తి జ్యోతిరావు పూలే.  బడుగు వర్గాల చరిత్ర గురించి సత్య శోధక్ సమాజం అనే సంస్థ ద్వార చెప్పిన వ్యక్తి జ్యోతిరావు పూలే. మానత్వం రావాలంటే వర్గ పోరాటాలు తప్పవని, కుల సమాజం పోవాలంటే అందరూ సమానత్వంతో పని చేయాలి. కుల రహిత సమాజం కోసం అందరం కలసి కట్టుగా పని చేయాల్సిన అవసరమని అన్నారు.  స్త్రీ విద్య కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. సమాజాన్ని విశ్లేషించి సమాజంలో ఉన్న భావజాలం గురించి అనేక రకాల పుస్తకాలు కూడా రాసిన వ్యక్తులు మహనీయులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థాపించిన బీసీ గురుకుల పాఠశాలలు అన్ని  జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు అగ్రకుల పేద బిడ్డలు కూడా విదేశీ విద్య కోసం ఓవర్సీస్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్న  ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు ఉన్నాయి అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలని. 47 దేశాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. విద్య ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధిస్తామనే సంకల్పంతో అంబేద్కర్  ముందుకెళ్లారు. అంబేద్కర్ కి మొట్టమొదటి డాక్టరేట్ అందించిన విశ్వవిద్యాలయం మన ఉస్మానియా విశ్వవిద్యాలయం.  అణగారిన వర్గాల పట్ల, వారికి జరుగుతున్న అవమానాల పట్ల స్పందించిన వ్యక్తి అంబేద్కర్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కూడా అనేక రకాల పుస్తకాలు రాశారు. రాజ్యాంగ స్పూర్తితోనే భారతదేశ పరిపాలన నడుస్తుంది. ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు ఉన్నాయి అంటే బాబాసాహెబ్ కృషి ఫలితమే. కష్టనష్టాలు ఎదురైనా మన సంకల్పం అనేది స్పష్టంగా ఉండాలని  చెప్పిన వ్యక్తి అంబేద్కర్. విషయ పరిజ్ఞానమే ముఖ్యం కాదు  సమాజ పరిజ్ఞానం కూడా ఉండాలి విద్యార్థులకు. హైదరాబాద్ లో 127 అడుగుల విగ్రహం పెట్టి  నివాళులర్పించడం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు , ప్రిన్సిపల్  చింత సాయిలు,  ప్రొఫెసర్లు  బి పరమేష్, రమేష్ ,బసవరాజు, శ్రీను నాయక్, ప్రభాకర్ రెడ్డి, అజిత్, జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఐలయ్య, ధీరజ్ ,రేణుక, దుర్గ, రాంరెడ్డి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post Midle
Post Midle
Post bottom

Leave A Reply

Your email address will not be published.