వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్(ఐజేయు) నూతన కార్యవర్గం సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ సన్మానించారు. జర్నలిస్ట్ లు పార్టీలకు అతితంగా ప్రజల పక్షాన పనిచేస్తున్న
సైనికులని ప్రజా క్షేమం కోసం అనునిత్యం కృషి చేసే జర్నలిస్ట్ లను గౌరవించుకోవడం మన బాధ్యత అని అన్నారు. అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ,ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి నూగురి
మహేష్, సహాయ కార్యదర్శి దూలం సంపత్, కోశాధికారి మద్దిరాల నరేష్, కార్యవర్గ సభ్యులు మ్యాన శ్రీనివాస్,ఉల్లేందుల మల్లేశం,పాషా,గుడిసె కిషన్, తాటికొండ పవన్ , రేగుల సాయిబాబా, నామాల
శ్రీనివాస్ లను సన్మానించారు.ఈ సన్మాన కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ ఫౌండర్ సభ్యులు రేగుల దేవేందర్, సీనియర్ జర్నలిస్ట్ రాపెళ్లి శీనివాస్, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఎన్.టి బాబు
యాదవ్,పట్టణ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం,బిజెపి నాయకులు గోపు బాలరాజు, నందిపేట సుదర్శన్ యాదవ్, ముప్పిడి శ్రీధర్, నామాలశేఖర్, గుడిసె మనోజ్,కుమార్ తదితరులు ఉన్నారు.