పది మంది పేకాట వ్యక్తులు ఆడుతుండగా ఎస్ ఓ టి శంషాబాద్ పోలీసులు మరియు మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా పక్కా సమాచారంతో దాడులు
ఈరోజు తేదీ 20.06.2022 నాడు రాత్రి 1:00 సమయంలో మొయినాబాద్ లోని సురభి ఎంక్లేవ్ నందు ఒక రూమ్ లో సుమారు పది మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా ఎస్ ఓ టి శంషాబాద్ పోలీసులు మరియు మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా పక్కా సమాచారంతో దాడులు చేసి పేకాట ఆడుతున్న వారిని పట్టుకొని వారి నుండి 14 లక్షల 71 వేల 200 రూపాయలు, ఏడు సెల్ ఫాన్స్ మరియు అయిదు కార్లు స్వాధీనం చేసుకోడమైనది.
వారి పేర్లు తెలుసుకోగా శ్యాంసుందర్ రెడ్డి, ఎండీ జహంగీర్, పాండు, మహేందర్ రెడ్డి, సురేష్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్, మధుసూదన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మరియు శ్రీనివాస్ గౌడ్ అను వ్యక్తులు కలరు.