Telugu Updates

జగన్ సోదర సమానుడు.. ఏపీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా: కేటీఆర్

Post top
  • ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ
  • అన్యాపదేశంగా అవి అలా వచ్చేశాయన్న కేటీఆర్
  • తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ
పక్క రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు. పక్క రాష్ట్రం లో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో గత రాత్రి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరణ ఇచ్చారు. 
తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Post bottom

Leave A Reply

Your email address will not be published.