రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బిజి అయ్యారు
రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలు బిజి అయ్యారు. రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని పార్టీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ మేరకు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎలక్షన్ మెనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్ తదితరులు..సమావేశంలో పాల్గోన్నారు.