తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి,పి,వి.శ్యామసుందర్ రావు, ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి ప్రత్యేక స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు.ప్రధాన ఆలయంలో స్వయంభూ మూర్తులను దర్శించుకుని, ముఖ మండపంలో అష్టోత్తర మూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు.యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి మా ఇల వేల్పు అని తెలిపారు బీజేపీ నాయకులు బండి సంజయ్..
ఈ కార్యక్రమంలో మహిళ రాష్ట్ర ఉపఅధ్యక్షురాలు బండ్రు శోభారాణి,గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్.సుగుణాకర్,నరేందర్,రచ్చ శ్రీనివాస్,రాష్ట్ర విభాగం నాయకులు,తదితరులు పాల్గొన్నారు…