Telugu Updates

మంత్రి మల్లారెడ్డి కళాశాల ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా

Post top
  • మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి
  • మరణానికి గల కారణాలపై విచారణ జరపాలి
  • కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్
  • ధర్నా చేస్తున్న నాయకుల అరెస్టు బొల్లారం పీఎస్ కు తరలింపు

(మిణుగురు-మేడ్చల్ జిల్లా) : నిన్న మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన సి ఎం ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని సాత్విక అనుమానాస్పద మృతిపై అనుమానాలు వెల్లువెత్తడంతో సోమవారం నాడు ఉదయం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్,టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ,మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం లోని మండల, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి , గోమారం రమణారెడ్డి , సాయి పేట శ్రీనివాస్ , భీమిడి జైపాల్ రెడ్డి ,బొమ్మల పల్లి నరసింహులు యాదవ్ , యాష్కీ శంకర్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈరోజు కండ్లకోయ లోని మంత్రి మల్లారెడ్డి కాలేజీ ముందు విద్యార్థిని మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ధర్నా చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మృతి చెందిన సాత్విక అనే అమ్మాయి కుటుంబానికి న్యాయం చేసి మరణంపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ శాంతి యుతంగా కళాశాల ముందు ధర్నా చేస్తుంటే అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల సహాయంతో నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం ఎంత వరకు సమంజసమని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి మల్లారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి అనేక మంది విద్యార్థుల ప్రాణాల తీసుకునేలా వ్యవహరిస్తుండని వాపోయాడు.ఈ రోజు అధికారం ఉందని పోలీసులను ఉపయోగించి మమ్మల్ని అణిచివేతకు గురిచేస్తున్న మల్లారెడ్డి భవిష్యత్తులో ఇంతకు రెట్టింపు అనుభవిస్తావని హెచ్చరించారు.జరిగిన ఘటనకు నిరసనగా మేడ్చల్ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

పోలీసుల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైటాయించిన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ తదితరులు. విద్యార్థిని సాత్విక కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్…

 

[3d_viewer id=”64276″]

Post bottom

Leave A Reply

Your email address will not be published.