తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేది.. బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేది అని వ్యాఖ్యానించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు.
గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని నాగేశ్వర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.. కేంద్ర ప్రభుత్వం కాదు అని నాగేశ్వర్ గవర్నర్‌కు చురకలంటించారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.