వరంగల్ లోని జర్నలిస్టుల పిల్లలకి ఉచిత విద్యను అందించాలని వరంగల్ జిల్లా
టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కి వినతి పత్రం అందజేశారు వినతి పత్రం అందుకున్న కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా విద్యాశాఖ అధికారి కి సిఫారస్ చేయడంతో తక్షణమే జిల్లా విద్య శాఖ అధికారి వాసంతి, జర్నలిస్ట్ పిల్లలందరికీ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు గౌడ్ , జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రాంచందర్ , కార్యదర్శి మట్ట దుర్గప్రసాద్ , కోశాధికారి వి.శ్రీనివాస్ , సహాయ కార్యదర్శి బోళ్ల అశోక్, ఎలక్ట్రనిక్ మిడియా జిల్లా అధ్యక్షుడు అడెపు సాగర్, సంకినేని సంతోష్ తదితరులు పాల్గోన్నారు.