- బంజారాహిల్స్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు రేవ్ పార్టీ లో చిక్కిన 150 మంది.
- రాడిసన్ బ్లూ హోటల్ లో రేవ్ పార్టీ
- మద్యం మాదక ద్రవ్యాల మత్తులో పోలీసుల పైనే తిరగపడ్డ ఈ రేవ్ పార్టీలోని బడా బాబులా సంతానం
- ఉదయం 3 గంటలకు దాడి జరిగినట్టు సమాచారం
- బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర సస్పెండ్స్
- బంజారాహిల్స్ ఏసీపీ sudershan కి ఛార్జ్ మెమో???
హైదరాబాద్‌లో భారీ రేవ్ పార్టీ(Rave Party)ని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహీల్స్(Banjara Hills)లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రేవ్ పార్టీలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్లు సమాచారం. 39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది.
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ఆవరణలో ఉన్న పుడింగ్ అండ్ మిన్క్ పబ్ లో అదుపులోకి తీసుకున్న యువతులను వివరాలు సేకరించి బయటికి పంపుతున్న దృశ్యం.