Telugu Updates

జాతరకు వెళుతున్న కుటుంబానికి ప్రమాదం నలుగురు దుర్మరణం

Post top

ములుగు: ములుగు జిల్లా జాకారం గ్రామపంచాయతీ గట్టమ్మ మూలమలుపు వద్ద ఆర్టిసి బస్సు కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒక మహిళ, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోప్రయాణిస్తున్న భక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. శనివారం ఉదయం గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న వారు మేడారం వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.