Telugu Updates

సీఎం జగన్ జవాబు చెప్పాలి

Post top

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ: బాబాయ్ హత్యకేసుపై సీబీఐ నమోదుచేసిన తాజా ఛార్జ్ షీట్ పై జగన్మోహన్ రెడ్డి నోరువిప్పాల్సిందే. చార్జ్ షీట్ లోపేర్కొన్నట్టుగా హత్యతో సంబంధమున్న రాజకీయప్రముఖుల ఆటకట్టించేవరకు సీబీఐ నిద్రపోకూడదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. వివేకాహత్యతో జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఏం సంబంధం లేదన్న ట్లుగా నిన్నకొందరు సలహాదారులు మీడియాతో చెప్పుకొచ్చారు. చేతిలో సాక్షిఇతర అనుకూల మీడియాఉందికదా అని ఏదిపడితే అదిచెప్పి, ఎదుటివారిపై బురదజల్లుతామంటే కుదరదు. వివేకా హత్యజరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంమాట్లాడారో, విజయసా యిరెడ్డి ఏంచెప్పారో,సాక్షిమీడియా ఎలాంటికట్టుకథలు వండి వార్చిందో అందరికీ తెలుసు. దానికి సంబంధించిన వీడియోలు, ఇతరత్రా సాక్ష్యాధారాలు మావద్ద ఉన్నాయి. వాటిని ప్రజలముందు పెట్టాకే మాట్లాడతాం. హత్యజరిగినప్పుడుఏదేదో చెప్పి,ఎదుటివారిపై నిందలేసిన జగన్మో హన్ రెడ్డి, ఎన్నికలయ్యి అధికారంలోకివచ్చాక బాబాయ్ హత్య కేసుని తప్పుదారిపట్టించడానికి తనఅధికారాన్ని వినియోగించా డు, ఇప్పటికీ వినియోగిస్తున్నాడు. వివేకాను హతమార్చి, తల్లి తరువాత తల్లి, చెల్లి తరువాత చెల్లిఅయిన సొంతపిన్ని, చెల్లెమ్మల ను కూడా మోసగిస్తూ, తనబంధువు, ఎంపీ అయిన వై.ఎస్. అవి నాశ్ రెడ్డిని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఈ మూడేళ్లలో చేయ ని ప్రయత్నమంటూ లేదు. మూడేళ్లలో ఢిల్లీవెళ్లి, ప్రధానిమోదీని, అమిత్ షాని కలిసినప్రతిసారీ వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డిని, తనను బయటేయాలనే జగన్మోహన్ రెడ్డి వేడుకున్నాడు.

తాజాగా సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ గమనిస్తే, అసలుదోషులెవరో, ఎవరి అండ దండలతో వివేకానందరెడ్డి హత్యజరిగిందో అర్థమవుతోంది. వివేకాహత్యజరిగిన తెల్లారక ఉదయం 6గంటలకే తొలిసారి వివేకా ఇంట్లోకి వెళ్లింది వై.ఎస్.అవినాశ్ రెడ్డి, ఇప్పుడు ఏ5గా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డే. వివేకానందరెడ్డి పీఏ జిల్లాఎస్పీకి ఫోన్ చేసి, రక్తం కక్కకొని చనిపోయాడని చెప్పారు. సాక్షి మీడియాలో ఉదయం 7 గంటలప్రాంతంలో గుండెపోటుతో చనిపోయాడని, తరువాత హత్య చేశారని కథనాలుప్రసారం చేయించారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలికి వెళ్లాకే అసలువాస్తవాలు బయటకువచ్చాయి.వాళ్లేహత్యకు ప్లాన్ చేసి, హతమార్చి, హత్యచేసినవారిని, చేయిం చినవారిని వెనకేసుకురావాలని, కాపాడాలని ప్రయత్నిస్తున్నా రు. ఆక్రమంలోనే బరితెగించిమరీ చంద్రబాబునాయుడిపై, లోకేశ్ గారిపై నిస్సిగ్గుగా ఆరోపణలుచేశారు. కరుడుగట్టిన నేరగాళ్లే రాష్ట్రా న్ని పాలిస్తున్నారు అనడానికి వివేకాహత్యోదంతమే నిదర్శనం. వి వేకాహత్యలో ఎవరు ఏ పాత్రపోషించాలి..ఎవరినిఎలా వాడుకోవాల నేదిముందుగానే నిర్ణయించిమరీ అమలుచేశారు. వివేకాహత్యకు రూ.40కోట్లు ఇచ్చింది అవినాశ్ రెడ్డి అయితే, అతన్ని కాపాడటా నికి రంగంలోకి దిగింది జగన్మోహన్ రెడ్డి. హత్యచేసిన గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వివేకామాజీ డ్రైవర్ దస్తగిరి అందరూ అవినాశ్ రెడ్డి అనుచరులే.

ఇంతపకడ్బందీగా వారేహత్యకు పథకరచనచేసి, పనిముగించేశా క, ఎన్నికలు ముగిసేవరకు ఆగి, ఆ నేరాన్ని టీడీపీపై వేయడానికి శతవిధాలాప్రయత్నించారు.జగన్మోహన్ రెడ్డికి, వివేకాహత్యతో సంబంధంలేకపోతే, ఎన్నికల సమయంలో వివేకాహత్యకేసువివరాలు బయటకురాకూడదంటూ హైకోర్ట్ నుంచి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. మరలా ఆయనే ఏమీ తెలియనట్టు సీబీఐతో విచారణజరిపించాలంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఎన్నికలుముగిసి, తాను ముఖ్యమంత్రి అయ్యాక వివేకా హత్యకేసు విచారణను వేగవంతంచేయించాల్సిన వ్యక్తే, సీబీఐవిచా రణకోరుతూ
తాను వేసిన పిటిషన్ ను వెనక్కుతీసుకున్నాడు. ఎందుకలాచేశాడంటే ఇప్పటికీ సమాధానంలేదు. హత్యజరిగిన వెంటనే హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి, నింపాదిగా 10, 15 గంటలు ప్రయాణించి, మార్చి 16 సాయంత్రానికి రోడ్డుమార్గంలో కడపకువచ్చాడు. హత్యజరిగిం ది మార్చి15 తెల్లవారుజామున అయితే, జగన్మోహన్ రెడ్డిఎప్పుడో మార్చి 16సాయంత్రానికి వచ్చాడు. ఈలోపు ఆయన మార్గదర్శకంలో అవినాశ్ రెడ్డి, వివేకాఇంటిలోని సాక్ష్యాధారాలను రూపుమాపాడు. హత్యజరిగినప్పుడు స్థానికసీఐ అక్కడకు వెళ్లే అతన్ని లోపలకుకూడా వెళ్లకుండాఅడ్డుకున్నారు. ఇదంతా ఎందు కుచేశారు? ఎవరుచెబితే చేశారు? ఈప్రశ్నలన్నింటికీ ముఖ్యమం త్రి సమాధానంచెప్పాల్సిందే. అని అయన డిమాండ్ చేసారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.